అదే శ్రీదేవి ప్రత్యేకత, ఆమె ఎక్స్ప్రెషన్స్ ని గమనించే వాడిని

  • 6 years ago
Venkatesh remembers Sridevi. Venkatesh shares beautiful movements with Sridevi.

అతిలోక సుందరి శ్రీదేవి కోట్లాదిమంది అభిమానులని విడచి వెళ్లిపోయారు. చిన్ననాటి నుంచే నటిగా ప్రయాణం మొదలు పెట్టిన శ్రీదేవి అంటే టాలీవుడ్ స్టార్స్ కి చాలా అభిమానం . శ్రీదేవి అంత్యక్రియలకు హాజరై తిరిగి వచ్చిన తరువాత విక్టరీ వెంకటేష్ శ్రీదేవితో ఉన్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
అప్పటికే మెగాస్టార్ చిరంజీవి చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో శ్రీదేవి నటించి మెప్పించింది. ఆ చిత్రంలో దేవ కన్యగా శ్రీదేవి రూపం, నటన వర్ణనాతీతం. ఆ తరువాత శ్రీదేవి విక్టరీ వెంకటేష్ క్షణ క్షణం చిత్రంలో నటించి మెప్పించింది. క్షణ క్షణం చిత్రంలో తనతో నటించిన శ్రీదేతో వెంకీకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీనితో శ్రీదేవి మరణ వార్త తెలుసుకుని వెంకీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముంబై వెళ్లి ఆమె అంత్య క్రియల్లో పాల్గొన్నారు. తిరిగి వచ్చాక ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు
శ్రీదేవి సినిమా జర్నీ మోస్ట్ రేర్ అని వెంకీ అన్నారు. శ్రీదేవి లాంటి వాళ్ళని చూస్తే వారు సినిమా కోసమే పుట్టారని అనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయం సాధించారు. అన్ని చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్నారు.
శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటులతో నటించారు. ఆ తరువాత మా తరం నటులతో కూడా నటించారు అని వెంకీ తెలిపాడు. వెళ్లిన ప్రతి ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు. అదే శ్రీదేవి ప్రత్యేకత అని వెంకీ అన్నారు.
క్షణ క్షణం చిత్రంలో శ్రీదేవి హీరోయిన్ అనగానే మేమంతా చాలా ఎగ్జైట్ అయ్యాం అని వెంకీ అన్నారు. నటనలో శ్రీదేవి అప్పటికే నా కన్నా చాలా సీనియర్.

Recommended