Anushka Hurts Muslim Religious Views
  • 6 years ago
Anushka Sharma movie Pari banned in Pakistan. Censors claim film is against Islamic values.

విరాట్ కోహ్లీతో వివాహం జరిగిన తరువాత అనుష్క నటించిన తొలి చిత్రం పరి. హర్రర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ పాత్రలో అనుష్క శర్మ నటించిన తొలి చిత్రం ఇది. కాగా ఈ చిత్రం ఆదిలోనే వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే విరాట్ తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.
పరి చిత్ర విడుదల ఇండియాలో సాఫీగానే జరిగింది. కాని పాక్ లో మాత్రం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుపోయింది.
ఈ చిత్రంలో ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగగా సన్నివేశాలు ఉన్నాయంటూ పాక్ ప్రభుత్వం పరి చిత్రంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఖురాన్ సూక్తులతో కొన్ని సన్నివేశాలని అభ్యంతరకరంగా చిత్రీకరించారని పాక్ సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని నిషేధించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రంలో ఖురాన్ సూక్తులని, హిందూ మంత్రాలని మిక్స్ చేసి చేతబడులు వంటి సన్నివేశాలని చూపించారని పాక్ సెన్సార్ బోర్డు ఆరోపిస్తోంది.
Recommended