TDP, TRS, Janasena Mull In Telangana | Oneindia Telugu
  • 6 years ago
Andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu indicates TDP may make alliance with Telangana CM K Chandrasekhar Rao's TRS.

తెలంగాణలో ఎన్నికల తమ పార్టీ పొత్తుపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తేల్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడినట్లు చంద్రబాబు మాటల ద్వారా స్పష్టమవుతోంది. పార్టీ తెలంగాణ కార్యకర్తల సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పార్టీ మనుగడలో ఉంటుందని చెబుతూనే భవిష్యత్తు వ్యూహంపై ఓ స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించారు.
తెలంగాణలో పార్టీ మనుగడ సాగించాలంటే పొత్తు పెట్టుకోవడం తప్పదని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో అందరి అభిప్రాయాలను తెలుసుకుని పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతూనే ఏ పార్టీతో పొత్తు ఉంటుంందో చెప్పకనే చెప్పారు.
చంద్రబాబు మాటలను బట్టి బిజెపితోనూ కాంగ్రెసుతోనూ టిడిపి పొత్తు పెట్టుకోదనే విషయం తేలిపోయింది. కాంగ్రెసు వల్లనే తెలుగు ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. బిజెపి మనలను కాదనుకుందని చెప్పారు. అందువల్ల ఇక పొత్తు పెట్టుకోవాల్సింది టిఆర్ఎస్ పార్టీతోనే అని ఆయన చెప్పకనే చెప్పారు.
టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్ కూడా సిద్దంగానే ఉన్నారు. ఇప్పటికే ఈ పొత్తుపై ఓ నిర్ణయం జరిగిపోయిందని అంటున్నారు. కాంగ్రెసు పార్టీని దెబ్బ తీయడానికి తెలంగాణలో కమ్మ, వెలమ కాంబినేషన్ (వెల్కమ్) అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు ఎప్పుడో వెల్లడైంది. పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ పెళ్లికి కేసీఆర్ హాజరైనప్పుడు కేసీఆర్ ఇదే విషయంపై టిడిపి నేత పయ్యావుల కేశవ్‌తో మాట్లాడారని వార్తలు వచ్చాయి.
Recommended