Andhra Jyothy Government? Not AP Government?

  • 6 years ago
“Andhra Jyothy” government, instead of “Andhra Pradesh” government. This has shocked many.

ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ప్రకటనను మీడియా ప్రభుత్వ ప్రకటన పేరుతో ప్రచురిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికరం చోటు చేసుకుంది. ఇది వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటనను ఏకంగా పత్రికనే ప్రభుత్వంగా మార్చివేసినట్లుగా ఆ ప్రకటన ఉంది. ఈ మేరకు వైసీపీ అధినేత వైయస్ జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో దానిని ప్రశ్నించారు.
ఏపీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఓ ప్రకటన విడుదలయింది. ఇందులో 'ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' అని ఉండే బదులు 'ఆంధ్రజ్యోతి ప్రభుత్వం' అని పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి
ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం ఓ తెలుగు పత్రికా వార్తా ఏజెన్సీకి అప్పగించారు. ఆ పత్రిక ఏజెన్సీ ద్వారా అంటూ పత్రికలకు అందే సమాచారంలో తెలియజేస్తారు.
అయితే మంగళవారం కడప జిల్లా సమాచార శాఖ ద్వారా అందిన దేవాదాయ శాఖ ప్రెస్ నోట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఉండాల్సిన చోట ఆంధ్రజ్యోతి ప్రభుత్వం ఉందని, దీనిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని చెబుతున్నారు.
దీనిపై జిల్లా సమాచార శాఖ ఏడీని అడిగితే.. ఆ ప్రకటన అమరావతి కార్యాలయం నుంచి వచ్చిందని, యథాతథంగా పత్రికలకు పంపించామని చెప్పారని అంటున్నారు.
విమర్శకులు, మేధావులు, ఆలోచనాపరులయిన నెటిజనులు షరామామూలుగా చంద్రబాబును విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు.

Recommended