T20 Tri-Series : Suresh Raina Got A Chance | Oneindia Telugu

  • 6 years ago
After returning from South Africa, India will tour Sri Lanka for Nidahas Trophy. This T20 Tri-Series will be played between 6 – 18 March.

మూడేళ్ల నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు జట్టులో స్థానం సంపాదించుకున్న రైనా.. తనదైన మార్కును చూపించుకున్నాడు. దీంతో అతనిని బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరగనున్న ముక్కోణపు సిరీస్‌కు సైతం ఎంపిక చేశారు సెలక్టర్లు. దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకుని పైకి ఎగబాకాలనే ప్రయత్నంలో రైనా తీవ్రంగా sidaaమవుతున్నాడు.
ముక్కోణపు సిరీస్, ఐపీఎల్‌లో ఆడి తన ఆటతీరును మెరుగుపరుచుకుంటానని పేర్కొన్నాడు. క్రికెట్‌పై ఇంత ఆరాటంతో ఉన్న రైనాను.. అంతర్జాతీయ జట్టులో ఆడుతూ ఉన్నప్పుడే తొలగించారా..? పేలవ ప్రదర్శనతో విసిగి పోయి పక్కకు పెట్టారా..? అనేవి సగటు క్రికెట్ అభిమానికి తలెత్తే ప్రశ్నలు.
2005లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా పదేండ్ల పాటు భారత్ తరపున ఆడి రాటుదేలాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా తన వంతు పాత్ర పోషించాడు. 2015 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. చివరిసారిగా 2015 అక్టోబర్ 25న దక్షిణాఫ్రికాపై వన్డే మ్యాచ్ ఆడాడు. స్వదేశంలో సఫారీలతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రైనా రెండు మ్యాచుల్లో డకౌట్ అవడమే కొంప ముంచింది.
ఆ తర్వాత ఒక హాఫ్ సెంచరీ చేసినప్పటికీ సెలక్టర్లు ఇతడిని పక్కన పెట్టారు. ఆ ఏడాది మొత్తం 20 వన్డేలు ఆడి 4 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ చేశాడు. దాదాపు రెండున్నరేండ్లుగా వన్డే జట్టులో పునరాగమనం కోసం తపించిపోతున్న రైనా..గతేడాది యోయో పరీక్షలో పాసవడంతో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే.
సఫారీ పరీక్షలో పాసైన రైనా ఇప్పుడు శ్రీలంకలో జరుగబోయే ముక్కోణపు టీ20లోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. ఉపఖండ పిచ్‌లపై శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి బలహీనమైన జట్లను ఎదుర్కోవడం రైనాకు చాలా సులువు. ఓ రెండు భారీ ఇన్నింగ్సులు ఆడితే చాలు భవిష్యత్ మ్యాచుల్లో రైనా స్థానానికి ఢోకా ఉండదు.

Recommended