KTR Praises Cricketer Rahul Dravid
  • 6 years ago
Rahul Dravid played a huge role in guiding the India U-19 team to victory in the World Cup earlier this month but refused to take any extra credit or share of the prize money which the Board of Control for Cricket in India (BCCI) had promised to him and his support staff.

ఇండియా ఏ, అండర్-19 జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ అంటే తనకు ఎందుకు అంత ఇష్టమో చెప్పారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు. ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్‌ తనకు అత్యంత ఇష్టమని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అందిన దానితో ఆనందపడి పక్కన వాళ్లు పాడైపోతున్నా పట్టించుకోని జనరేషన్‌లో ద్రవిడ్ సమన్యాయం అంటూ బీసీసీఐని కోరాడు. అంతే నజరానా షురూ అయిపోయింది
ఇటీవల న్యూజిలాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్‌ని భారత యువ జట్టు సొంతం చేసుకుంది. ఈ వరల్డ్ కప్ అనతంరం బోర్డు ద్రవిడ్‌కు రూ.50 లక్షలు, మిగతా సహాయ సిబ్బందిలో ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్‌ చేశాడు. అంతే కాదు.. ద్రవిడ్ చొరవ వల్ల గతేడాది మరణించిన టీమ్ ట్రైనర్ రాజేష్ సావంత్ కుటుంబానికి ఆర్థిక సాయం అందనుంది. భారత కుర్రాళ్లు వరల్డ్ కప్ నెగ్గడంతో అతడికి కూడా బీసీసీఐ ప్రోత్సాహకం ప్రకటించింది. బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రితో మాట్లాడిన రాహుల్.. జట్టు విజయం సాధించడానికి ఏడాదిపాటు కష్టించామని చెప్పాడు. అందుకే ప్రస్తుతం జట్టుతోపాటు లేనప్పటికీ.. అండర్-19 జట్టు విజయం కోసం తమ వంతు కృషి చేసిన పాత సిబ్బందికి కూడా నజరానా ఇవ్వాలని కోరాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ద్రవిడ్‌తో పాటు అందరికీ ఒకే రకంగా రూ.25 లక్షల చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది.దీనిపై ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్త కథనాన్ని తన ట్విట్టర్‌లో నెటిజన్లతో షేర్ చేసిన కేటీఆర్‌... ఒక క్రికెటర్‌గానే కాదు.. వ్యక్తిగా కూడా ద్రవిడ్‌ తనకు అత్యంత ఇష్టమని ట్వీట్‌ చేశారు.
Recommended