IND vs SA 3rd T20 : Sourav Ganguly's Comments On MS Dhoni
  • 6 years ago
Ganguly said Dhoni's contributions should be respected.When asked about young players getting an opportunity in Indian cricket, Ganguly said a lot of young players represent the country.

టీ20 క్రికెట్ లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌కు మనుగడలేదని టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు చేస్తున్న ప్రదర్శనపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు గంగూలీ సమాధానాలు ఇచ్చాడు. సఫారీ గడ్డపై వన్డేల్లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసిందని కొనియాడాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా అద్బుతంగా ఆడి వన్డే సిరీస్‌ గెలిచిందని, చివరి టీ-20లో సైతం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోహ్లిసేనకు ఇదొక మంచి పర్యటన అని చెప్పారు. ఈ సందర్భంగానే 'క్రికెట్‌కు టీ20లు కచ్చితంగా కావాల్సిందే అని గంగూలీ చెప్పాడు.
అప్పటికీ ఇప్పటికీ ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఎలా ఉందన్న ప్రశ్నకు ఎప్పటిలాగే పారదర్శకంగా ఉందని చెప్పాడు. 'భారత ఎంపిక ప్రక్రియ అత్యుత్తమ విధానం' అని దాదా పేర్కొన్నాడు. కోచ్‌లను తొలగించడం, పదవీ కాలం తక్కువ చేయడం గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో ఇకపై జరగబోదని గంగూలీ చెప్పాడు.
చాలా మంది యువ ఆటగాళ్లను దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. 'మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్య భారత జట్టులో నిలకడగా ఆడుతున్నారు. సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్లుగా మారడానికి వారికి మరింత సమయం పడుతుంది. వీరూ, భజ్జీలకు చాలా కాలమే పట్టింది' అని అన్నాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధోని అద్భుతమైన ప్లేయర్‌ అని కితాబిచ్చాడు. ధోని గురించి మాట్లాడుతూ 'ధోనీ వన్డేలు, టీ20ల్లో చక్కగా ఆడుతున్నాడు. మనం అతడిని తక్కువ చేయలేం. అతడు దేశానికి చేసిన సేవలను కచ్చితంగా గౌరవించాలి. అయితే మరొకరూ ఎదిగేందుకు అవకాశం ఇవ్వాలి' అని గంగూలీ అన్నాడు.
Recommended