భర్త లేనప్పుడు టచ్ లోకి మాజీ? తర్వాత ఏమయిందో తెలుసా ?

  • 6 years ago
A married woman’s past is back to made problem to her present as her ex-boyfriend has Blackmails her

తాను డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ యువకుడితో ప్రేమలో పడిందో యువతి. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు పెళ్లి కావడంతో అతన్ని దూరం పెట్టింది. కాగా, పెళ్లి తర్వాత ఆమె భర్త ఉపాధి కోసం దుబాయ్ వెళ్లడంతో పాత ప్రియుడు మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య కొన్నిరోజులు మామూలుగానే మాటలు నడిచాయి. కానీ ఉన్నట్టుండి మాజీ ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. గతంలో తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలు, వీడియోలు చూపించి.. మళ్లీ తనతో గడపాలని బెదిరించాడు.
యువతితో టచ్ లోకి వచ్చిన మాజీ ప్రియుడు ఆమెతో లైంగిక కోరిక తీర్చుకోవాలని భావించాడు. నయానో.. భయానో.. ఆమెను లొంగదీసుకోవాలనుకున్నాడు. అతని బ్లాక్ మెయిలింగ్‌కు యువతి లొంగకపోవడంతో.. పాత ఫోటోలు బయటపెడుతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.
ఒక్కసారి తన వద్దకు వస్తే.. ఇక జీవితంలో నీ జోలికి రానంటూ యువతిని పవన్ బ్లాక్ మెయిల్ చేశాడు. లేదంటే.. తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను ఆమె భర్తకు, కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులకు లొంగిపోయిన యువతి.. అతను చెప్పినట్టే బెంగళూరు వెళ్లింది.
బెంగళూరు వెళ్లి పవన్ ను కలిసొచ్చాక కూడా అతని నుంచి వేధింపులు ఆగలేదు. మరో కొంతమంది పేర్లు చెప్పి వారితోనూ గడపాలని పవన్ ఆమెను బెదిరించాడు. సదరు యువతి ఎంతకీ లొంగకపోవడంతో ఈసారి సరాసరి ఆమె ఇంటికే వచ్చాడు.

Recommended