BJP Leader Fires At TDP And Congress

  • 6 years ago
BJP leader Somu Veerraju on Friday said that he played key role in polavaram project issue. And bjp only can fulfill ap needs he told to media.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడి ఉన్నది తమ పార్టీనేనని భారతీ జనతా పార్టీ నేత సోము వీర్రాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు కాంగ్రెస్, టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాతో ఒరిగేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని సోము వీర్రాజు అన్నారు. హోదా అంటే జైలుకేనంటూ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. అంతేగాక, అందుకు సంబంధించిన మీడియా కథనాలను చూపించారు.
ప్రత్యేక హోదాతో వచ్చేది రూ.3వేల కోట్లేనని, మనమే ఎక్కువ సాధించామని సీఎం చంద్రబాబు చెప్పారని సోము వీర్రాజు తెలిపారు. అలాంటి చంద్రబాబును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. నాడు సీఎం చంద్రబాబు చెప్పినవే.. తాను ఇప్పటి వరకు చెబుతున్నానని సోము వీర్రాజు తెలిపారు.
రాష్ట్ర విభజనలోనూ చంద్రబాబు రెండు నాల్కల దోరణి అవలంభించారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. తెలంగాణకు వెళ్లి తాను రాష్ట్రపతికి విభజన లేఖ ఇచ్చానని చెప్పి.. ఆంధ్రాకు వచ్చి సమన్యాయం కోసం పోరాడుతున్నామని చంద్రబాబు చెప్పారని వీర్రాజు దుయ్యబట్టారు. తమ పార్టీ ఎప్పుడూ రెండు విధాలుగా మాట్లాడలేదని అన్నారు. వాస్తవాల్ని ఒప్పుకునే పార్టీ అని చెప్పారు.
అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ గురించి ఆలోచించారు కానీ.. ఏపీ 13 జిల్లాల గురించి ఆలోచించారా? అని వీర్రాజు ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి ఏమీ కావాలో కాంగ్రెస్ గానీ, టీడీపీ గానీ అడగలేదని అన్నారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఏపీకి న్యాయం కావాలని పోరాటం చేశారని చెప్పారు. హోదా 15ఏళ్లు కావాలని వెంకయ్యే అడిగారని చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు బిల్లులో ఏం పెట్టారని ప్రశ్నించారు. ఏపీ కోసం టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సభలో ఏం మాట్లాడారని వీర్రాజు నిలదీశారు. 14వ ఆర్థిక సంఘంలో ఏముందో అందరికీ తెలుసని అన్నారు. వెంకయ్యనాయుడే పోలవరం ముంపు మండలాల గురించి కూడా మాట్లాడారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ పోలవరం ముంపు మండలాల గురించి బిల్లులో పెట్టించారా? అని సోము వీర్రాజు నిలదీశారు.

Recommended