#SaveSupriya : Priya Varrier Gone, Internet Now Looking For Supriya

  • 6 years ago
Mumbai girl Aishwarya Sharma wrote a Facebook post about a conversation she overheard at a popular watering hole in Andheri.

సోషల్ మీడియా పుణ్యమాని మంచైనా.. చెడైనా ఈరోజుల్లో క్షణాల్లో వైరల్ అవుతోంది. మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియో దేశవ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో.. ఇప్పుడు 'సేవ్ సుప్రియా' అన్న ఓ పోస్టు కూడా అంతే వైరల్ అవుతోంది. ముంబై నుంచి మొదలై బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా, ఇలా అన్ని నగరాలకు ఆ హాష్ ట్యాగ్ వ్యాపిస్తోంది.
ముంబైకి చెంది ఐశ్వర్య శర్మ ఇటీవల అంధేరీలోని ఓ పబ్ కు వెళ్లింది. అక్కడ తన వెనకాలే కూర్చున్న ఇద్దరు యువకులు ఓ యువతి గురించి చేసిన కామెంట్స్ విని షాక్ అయింది.
అందులో అమన్ అనే ఓ యువకుడు.. 'బ్రో.. నేను సుప్రియా కళ్లుగప్పి నిన్న రాత్రి నిధితో వెళ్లాను, ఇద్దరం కలిసి ఎంజాయ్ చేశాం' అని మరో స్నేహితుడితో చెప్పడం ఐశ్వర్య చెవిన పడింది. దానికి ఆ స్నేహితుడు 'సూపర్‌ రా...సుప్రియ ఆ విషయాన్ని కనిపెట్టలేదు' అని బుదలివ్వడంతో మరింత షాకైంది.
సుప్రియను తాను మోసం చేస్తున్నానన్న సంగతి ఆమె కనిపెట్టలేదని సదరు బాయ్ ఫ్రెండ్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవడంతో.. ఈ విషయం ఎలాగైనా ఆమెకు తెలియాలని ఐశ్వర్య ఫిక్స్ అయింది. ఫేస్ బుక్ లో ఆమె కోసం సెర్చ్ చేసింది. కానీ ఎంతోమంది సుప్రియల్లో ఆమెనే గుర్తుపట్టడం ఎలా?.. అందుకే ఓ నిర్ణయానికి వచ్చింది.. 'సేవ్ సుప్రియ' పేరుతో ఓ హాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పోస్టు పెట్టింది.
సుప్రియా. నీ బాయ్ ఫ్రెండ్ పేరు గనుక అమన్‌ అయితే వాడితో జాగ్రత్తగా ఉండు. వాడు నిన్ను మోసం చేసి నిధితో తిరుగుతున్నాడు. వాడో వెధవ (బూతులు కూడా...). నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. సుప్రియా పేరుతో ఉన్న అమ్మాయిలందరికీ విజ్ఞప్తి. మీ బాయ్‌ప్రెండ్‌లలో ఎవడైనా అమన్‌ పేరుతో ఉంటే... వెంటనే వాడితో బ్రేకప్‌ చెప్పేయండి. సుప్రియకు చేరేదాకా దీన్ని షేర్ చేయండి..' అంటూ ఐశ్వర్య తన పోస్టులో పేర్కొంది.