13 Digit Mobile Numbers For M2M Customers Only

  • 6 years ago
The Department of Telecom (DoT) has issued instructions to all telecom operators to start using 13 digit mobile numbers for all existing Machine-to-Machine (M2M) customers from October 18 onward

త్వరలోనే సెల్‌ఫోన్లకు 13 అంకెల నెంబర్లు రానున్నాయి. కేంద్ర టెలికం శాఖ టెలికం ఆపరేటర్లను 13 అంకెల నెంబర్లను వినియోగదారులకు కేటాయించాలని కోరింది. త్వరలోనే 13 అంకెల సెల్‌ఫోన్ నెంబర్లు అందుబాటులోకి రానున్నాయని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి చెప్పారు. సెల్‌ఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన రక్షణ ఇచ్చేందుకు గాను 13 అంకెల నెంబర్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర టెలికం శాఖ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు టెలికం శాఖ 13 అంకెల నెంబర్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ప్రస్తుతం అందరి మొబైల్ నెంబర్లు 10 అంకెలకే పరిమితం . అయితే ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రస్తుతం మనుగడలో ఉన్న 10 అంకెల నెంబర్లన్నీకూడ 13 అంకెల జాబితాలోకి మార్చబడతాయి.ఈ ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్ 31,వ తేది నాటికి పూర్తి చేయాలని కేంద్ర టెలికం మంత్రిత్వశాఖ ప్లాన్ చేస్తోంది.
దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు... 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది.
2018 జూలై నుండే టెలికం శాఖ కొత్తగా మొబైల్ ఫోన్ వినియోగదారులకు 13 అంకెల నెంబర్లను కేటాయించనుంది. ఈ ఏడాది జూలై నుండి కొత్తగా ఫోన్ కనెక్షన్ తీసుకొనే వారికి 13 అంకెల నెంబర్లు మాత్రమే కేటాయించనున్నారు.
ఇప్పటివరకు చైనాలో 11 అంకెలున్న మొబైల్ నెంబర్లను వాడుతున్నారు. ప్రస్తుతానికి ఇదే అత్యధిక అంకెలున్న మొబైల్ నెంబర్లుగా ఖ్యాతి చెందింది. అయితే ఇండియా 13 అంకెలు ఉన్న నెంబర్లను ఉపయోగిస్తే ఇండియాలోనే ఎక్కువ అంకెలతో మొబైల్ నెంబర్లున్న దేశంగా రికార్డు సృష్టించనుంది. దేశానికి చెందిన కోడ్ కలిపితే ఇండియాలో మొబైల్ ఫోన్ నెంబర్ 15 అంకెలకు చేరుకొంటుంది.