Modi at Shravanabelagola for 'Bahubali Mahamasthakabhisheka Mahotsava'

  • 6 years ago
Prime Minister Narendra Modi in Karnataka’s Shravanabelagola for the Baahubali Mahamasthakabhisheka Mahotsav. Modi inaugurated the newly carved 630 steps on the Vindhyagiri hill that takes the disciples to the top for a darshan of the 58.8 feet tall monolithic statue of Bahubali


కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన 'ఆయుష్మాన్ భారత్ 'భీమా పథకం ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని శ్రావణబెళగోళలోని విధ్యగిరి కొండ మీద బాహుబలికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ అనంతంరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ గురించి ప్రస్తా వించారు.
భారతదేశంలో సామాజిక కార్యక్రమాల కంటే ధార్మిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదన తప్పు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే సామాజిక, ధార్మిక కార్యక్రమాలు కలిసే ముందుకు వెలుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
శ్రావణబెళగోళలో బాహుబలికి జరుగుతున్న మహామస్తకాభిషేకం ఉత్సవాలకు హాజరుకావడానికి తాను పుణ్యం చేసుకున్నానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ గోమటేశ్వురుడి శ్లోకాలు చెప్పడంతో ఆ ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.
కేంద్రం శ్రావణబెళగోళ అభివృద్దికి చేతనైన సహాయం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ నిధులతో విధ్యగిరి కొండ మీదకు చేరుకోవడానికి నిర్మించిన 630 కాలినడక మెట్లు, బాహుబలి ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.

Recommended