Bigg Boss 2 : Allu Arjun To Host Telugu Bigg Boss

  • 6 years ago
Reports states that the Bigg Boss makers had approached Allu Arjun for the second season. However, none of these reports are confirmed as neither by Jr NTR, Allu Arjun nor the channel has announced any such news on their social media

దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షో లేటుగా స్టార్ట్ అయినా గానీ దానికి వచ్చిన స్పందన అనూహ్యం. తొలి సీజన్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెండో సీజన్‌కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. తొలి సీజన్‌కు తమిళంలో విలక్షణ నటుడు కమల్ హాసన్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా దుమ్ము దులిపేశారు. తమిళంలో రెండో సీజన్‌కు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తెలుగులో మాత్రం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంపై సందేహం నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హోస్ట్‌ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది.
తెలుగులో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించినందుకు జూనియర్ ఎన్టీఆర్‌కు భారీగానే రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం. ప్రతీ ఎపిసోడ్‌కు యంగ్‌టైగర్‌కు రూ.35 లక్షల చొప్పున చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొత్త ప్రాజెక్టుల కారణంగా బిగ్‌బాస్ రియాలిటీషోకు ఎన్టీఆర్ దూరమవుతున్నట్టు సమాచారం.
జై లవకుశ సక్సెస్ తర్వాత తదుపరి చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అంటే అక్టోబర్ నెల నుంచి దర్శకుడు రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్‌ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రాజెక్టుల ఒత్తిడి కారణంగా బిగ్‌బాస్‌ రియాలిటీ షో చేయడానికి ఎన్టీఆర్ సుముఖంగా లేనందున ప్రస్తుతం నిర్వాహకులు అల్లు అర్జున్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై అటు ఎన్టీఆర్ సైడ్ నుంచి గానీ, ఇటు అల్లు అర్జున్ ఎలాంటి స్పందన గానీ, ప్రకటన గానీ రాకపోవడంతో ఈ వార్తలో వాస్తవం ఎంత అనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది.
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో విషయంలో ఎన్టీఆర్ తన ప్రతిభతో కొత్త ప్రమాణాలు సెట్ చేశాడన్నది వాస్తవం. ఒకవేళ నిజంగా ఎన్టీఆర్ చేయకపోతే టెలివిజన్ ప్రేక్షకులకు కొంత నిరాశే. అయితే అల్లు అర్జున్ ఒకవేళ హోస్ట్‌గా వ్యవహరిస్తే ఆ లోటును తన యాక్టివ్‌నెస్‌తో అతను పూడ్చడం జరుగుతుందనేది సినీ వర్గాల సమాచారం.

Recommended