YSRCP MLA Roja questions Pawan over JFC
  • 6 years ago
YSRCP MLA Roja questions pawan kalyan over special status issue on monday. And she lashed out at tdp and tdp leaders over special package.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ నేతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్‌సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్‌ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు.
పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని, అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టేందుకు పవన్ సహకరిస్తారా? ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
ఏప్రిల్ 6లోగా ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఇప్పటికే తమ అధినేత జగన్ ప్రకటించారన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.
టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని రోజా ఆదివారం మీడియాతో సమావేశంలో పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం.. అన్నిపార్టీలు పొగబెట్టిన తర్వాత బయటికొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు చంద్రబాబు కానీ, ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు. ప్యాకేజీతో ఉపయోగం లేదని వైసీపీ అధినేత వైయస్ జగ్మోహన్ రెడ్డి చెప్పారని రోజా గుర్తు చేశారు.
Recommended