శృంగార దేవత : రవితేజ న్యూ హీరోయన్ హాట్ టాపిక్

  • 6 years ago
Ravi Teja new movie heroine Malvika Sharma photos hot topic in social media. Ravi Teja has signed project with Soggade Chinni Nayana and Rarandoi Veduka Chuddam fame director Kalyan Krishna. The title of the movie is 'Nela Ticket'. Malavika Sharma who is a model is playing the female lead.

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'సోగ్గాడే చిన్నినాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' లాంటి హిట్ చిత్రాలు చేయడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా మాళవిక శర్మ అనే హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
ఈ పాప గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తెరపై రవితజ స్పీడు ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి స్పీడుకు తగిన కత్తి లాంటి హీరోయిన్ దొరికితే టైమింగ్ అదిరిపోద్ది. శృుంగార దేవతలా సెక్సీగా ఉండే హీరోయిన్ అయితే అటు ఎంటర్టెన్మెంట్, ఇటు గ్లామర్ తోడై అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి.
మాళవిక శర్మ విషయానికొస్తే.... ఆవిడ ఓ ఇంటర్నెట్ సంచలనం. ఇటీవలే 20వ వడిలోకి అడుగు పెట్టింది. కొన్ని సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మాళవిక శర్మ ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూస్తే ఈ అమ్మడి వ్యవహారం మీకు ఇట్టే అర్థమవుతుంది. తన అందాల ప్రదర్శనతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
ప్రస్తుతం మాళవిక శర్మ తన చదువు కొనసాగిస్తూనే.... అటు సీరియల్స్, యాడ్స్, సినిమాలు అంటూ దూసుకెళుతోంది.
మాళవిక శర్మకు రవితేజ సినిమాలో అవకాశం దొరికింది అని తెలిసినప్పటి నుండే ఆమె గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చయడం ప్రారంభించిన తెలుగు కుర్రాళ్లు ఆమె అందం చూసి ఫిదా అవుతున్నారు.

Recommended