హాట్ సాంగ్ అన్నాడు, వాడిని చెప్పుతో కొట్టాలి, జైలుకెళ్లాడు, 420

  • 6 years ago
Few days back Producer Sk Basheed made Controversial Comments On Sundeep Kishan. Now Sundeep kishan Clarifies about Controversy With Producer SK Basheed.

కుక్కతో సినిమా చేస్తా... సందీప్ కిషన్‌తో చేయను, అతడో మోసగాడు" అంటూ ఓ నిర్మాత ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం నెల రోజుల క్రితం సంచలనం అయిన సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎస్.కె.బషీద్ ఈ సంచలన కామెంట్స్ చేశారు. ఆ నిర్మాత అన్నన్ని మాటలన్నా, దారుణమైన ఆరోపణలు చేసినా సందీప్ కిషన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా సందీప్ కిషన్ ఈ విషయమై స్పందించారు.
ఎస్.కె.బషీద్ విషయంలో అప్పుడే స్పందించాలని అనుకున్నాను. అయితే నా సన్నిహితులు, వెల్ విషర్స్ వచ్చి కుక్కలు మొరుగుతాయి, మనం స్పందించడం అవసరమా? మనం లీగల్‌గా వెళ్లాలని చూస్తున్నాం అని నన్ను ఆపారు. ఇపుడు ప్రెస్ మీట్ పెడదామనుకున్నా కూడా ఆపారు. కానీ ఎక్కడికెళ్లినా నన్ను ఈ విషయం గురించే అడుగుతున్నారు. అందుకే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అంటూ.... సందీప్ కిషన్ ఈ ఇష్యూపై రెస్పాండ్ అయ్యారు. అతడు 420, అబద్దాలు చెప్పాడు, చెప్పుతో కొట్టాలి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు
మాయావన్ అనే ఒక తమిళ సినిమాను తమిళంలో మొదలు పెట్టి కాంట్రాక్టులో దీన్ని తెలుగులో డబ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాం. ఇది పోలీస్ సినిమా కాబట్టి బైలింగ్వల్ సూటవ్వదు, ప్రతి సీన్లో పోలీస్ యూనిఫాంతో పాటు బ్యాక్ డ్రాప్ వర్కౌట్ అవ్వదు. అందుకే అలా చేశాం. ఇందుకోసం లావణ్యను కూడా ఒప్పించాం. నేను తమిళ సినిమా చేసినపుడు దానికి డబ్బింగ్ చెప్పాలనో, తెలుగులో పబ్లిసిటీ చేయాలనో రూల్ లేదు. కానీ పర్సనల్ గా కేర్ తీసుకుని ఈ సినిమాకు 7 రోజుల డబ్బింగ్ రామానాయుడు స్టూడియోలో సెట్ చేశాను. అందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి.... అని సందీప్ కిషన్ తెలిపారు.

Recommended