Punjab National Bank Scam : ED Raids Nirav Modi Properties
  • 6 years ago
The Enforcement Directorate is currently conducting raids at the residence and offices of Nirav Modi and PNB. Punjab National Bank on Wednesday revealed it has detected a $1.77 billion (about Rs 11,400 crore) scam from a branch in Mumbai.

దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన ముంబై బ్రాంచీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఒక్క ముంబై బ్రాంచిలోనే సుమారు 1.8మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.11,359 కోట్లు)మోసం జరిగినట్లు గుర్తించామని బ్యాంకు వెల్లడించింది. దీని ప్రభావం ఇతర రుణదాతలపైనా పడే అవకాశముందని తెలిపింది. ముంబై శాఖలో పలు మోసపూరితమైన, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, కొంతమంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోందని పీఎన్‌బీ బుధవారం నాటి ఎక్ఛ్సేంజి ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ మోసపూరిత లావాదేవీలను బట్టి చూస్తే.. ఈ మొత్తాన్ని ఖాతాదారులు ఇతర బ్యాంకుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోందన్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ఈ లావాదేవీలపై బ్యాంక్‌ ఎలా వ్యవహరిస్తుంది?, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు డబ్బులను రికవర్‌ చేయగలుగుతారా?.. ఎలా చేస్తారు? అనే అంశాలపై ఏ మాత్రం స్పష్టత రావడంలేదని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు.
మోసపూరిత లావాదేవీల విషయంలో ఇప్పటికే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుపై విచారణ జరుగుతోంది. పీఎన్‌బీలో 44మిలియన్‌ డాలర్ల మోసపూరిత లావాదేవీల విషయంలో గత వారం ప్రముఖ నగల డిజైనర్‌ నీరవ్‌ మోడీపై సీబీఐ విచారణ చేపడుతోంది. అయితే తాజాగా గుర్తించిన మోసపూరిత లావాదేవీలకు, గతంలోని వాటికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో చోటు చేసుకున్న భారీ కుంభకోణం నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. నీరవ్ మోడీ ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నీరవ్ మోడీకి చెందిన 12 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్ల తెలుస్తోంది. ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న అధికారులపై చర్యలకు ఉపక్రమించింది.
Recommended