Is Sonia Gandhi Pawan Kalyan duo mull for AP

  • 6 years ago
The remark comes days after Sonia had to chair an Opposition meeting to forge a joint front against Prime Minister Narendra Modi as some of the allies such as tdp and janasena.Andhara CM and Telugu Desam chief Chandrababu Naidu expressed dissatisfaction towards the centre and has said that a crucial decision will be taken in a couple days. He was talking with the party MPs on a conference call.

కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీపై టీడీపీ ఎంపీల తీవ్ర విమర్శలు, విభజన హామీల అమలు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేఏసీ ఏర్పాటు ప్రయత్నాలు చేయడం వంటివి జరుగుతున్నాయి. అంతేకాదు, గురువారం జరిగిన ఏపీ బందుకు పరోక్షంగా టీడీపీ మద్దతు పలికింది. మరోవైపు లోకసభలో టీడీపీ ఎంపీలు సోనియా గాంధీని కలిశారు. టీడీపీ ఎంపీల నిరసనలు చేస్తుండగా సోనియా న్యాయం చేయాలని చిన్నగా అనడం, శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు అనుకూలంగా ట్వీట్. పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు వెల్‌లోకి వెళ్లగా ఆయనకు టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేష్, సీఎం రమేష్ జత కలిశారు. విభజన హామీల విషయంలో టీడీపీ, కాంగ్రెస్ తెలియకుండానే ఒక్కటవుతున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత టీడీపీ ఎంపీలు బీజేపీ మిత్రపక్షం అయినప్పటికీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందే అంటున్నారు. వారికి పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కూడా అదే విషయం చెబుతున్నారు. విభజన హామీలు నెరవేరలేదని, బడ్జెట్‌లో అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు లోబల బయట తీవ్రమైన నిరసనలు చేపట్టాలని పదేపదే సూచించారు.
ప్రస్తుతం చంద్రబాబు దుబాయ్‌లో ఉన్నారు. విభజన హామీలు నెరవేర్చడం లేదు.. బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరగలేదు.. వీటికి తోడు పార్లమెంటులో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీల ప్రకటనలు టీడీపీకి, చంద్రబాబుకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అందుకే వారు ప్రకటన చేసినా టీడీపీ ఎంపీలు బెట్టు వీడలేదు. శుక్రవారం కూడా బాబు ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. రెండ్రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుంటానని ఎంపీలకు హింట్ ఇచ్చారని తెలుస్తోంది.

Recommended