Rajinikanth Kabali Scene in Real Life, Must Watch

  • 6 years ago
Wednesday seemed like any other day at North Malayambakkam village. Chennai police crashes rowdy's birthday bash and arrest 73 history-sheeters

తమిళనాడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెన్నై సిటీ పోలీసులు ఒకేసారి 72 మంది పేరుమోసిన రౌడీషీటర్లను అరెస్టు చేశారు. ఒక్క రౌడీషీటర్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన సిటీలోని రౌడీలు అందరూ పోలీసుల వలలో పడ్డారు. రజనీకాంత్ నటించిన కబాలి సినిమా స్టైల్ లో బర్త్ డే పార్టీలో రౌడీని హత్య చెయ్యాలని ప్లాన్ వేశారు. నిందితుల నుంచి 8 కార్లు, 32 బైక్ లు, భారీగా మారణాయుధాలు, మొబైల్ లు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై సిటీలోనే పేరుమోసిన రౌడీషీటర్ బిను మంగళవారం రాత్రి మలయంబాక్కంలోని పున్నంమల్లే ప్రాంతంలోని తోటలో పుట్టిరోజు వేడుకలు జరుపుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్బంగా సిటీలో పేరుమోసిన రౌడీలు అందరికీ రౌడీషీటర్ బిను ఆహ్వానం పంపించారు. సిటీలోని దాదాపు 80 మంది రౌడీషీటర్లు బిను పుట్టిన రోజు వేడుకలకు హాజరైనారు.
బిను పుట్టిన రోజు సందర్బంగా కేక్ తెప్పించారు. అయితే కేక్ కత్తిరించే ప్లాస్టిక్ కత్తితో బిను కేక్ కట్ చెయ్యలేదు. మటన్ షాప్ లో మాంసం కైమా చేసే కత్తితో బిను కేక్ కత్తిరించి ఈలలు, కేకల మధ్య వరైటీగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. తరువాత బిను సాటి రౌడీలతో ఫోటోలు తీసుకుని మందు, విందు, చిందుల్లో గడిపాడు.
చెన్నైలోని పేరుమోసిన ఓ రౌడీషీటర్ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి రెండు కార్లలో బిను పుట్టిన రోజువేడుకలకు బయలుదేరాడు. అంత మంది ఒకే సారి రెండు కార్లలో బయలుదేరిన విషయం తాంబరం పోలీసుల కంటపడింది. ఎవరినైనా చంపడానికి వెలుతున్నారా అని పోలీసులకు అనుమానం వచ్చింది. అంతే పోలీసు జీపు పక్కన పెట్టి ట్రంక్ లో కార్లను వెంబడిస్తూ సిటీలోని పోలీసులు అందరికీ సమాచారం ఇచ్చారు.