అనుష్క ఆన్‌స్క్రీన్ భర్త అరెస్ట్, సైకో, గే, రాత్రుళ్లు చాటింగ్

  • 6 years ago
Actor Samrat Reddy Wife complaint against him in a robbery case at Madhapur Police Station.

టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై కేసు నమోదయింది. భార్య ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఇంట్లో దొంగతనం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.నటుడు సామ్రాట్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఇది రెండోసారి. గతంలో భార్య వరకట్నం కేసు పెట్టగా, ఈసారి దొంగతనం కేసు పెట్టింది. ఆ కేసు విచారణ జరుగుతుండగా ఈ కేసు నమోదు కావడం గమనార్హం.
గతంలో రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో కూడా భార్య అతనిపై వరకట్నం కేసు పెట్టింది. తనను వేధిస్తున్నాడని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 498/ఏ కింద ఆ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తాజాగా దొంగతనం కేసు .ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. దీంతో మంగళవారం ఉదయం అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. సామ్రాట్ రెడ్డితో పాటు అతడి సోదరి సాహితీ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కొంతకాలంగా సామ్రాట్‌కు అతని భార్యతో విభేదాలు ఉన్నాయి. దీంతో రెండు నెలలుగా ఇరువురు వేర్వేరుగా ఉంటున్నారు.
తాను ఇంట్లో లేని సమయంలో సామ్రాట్ వచ్చి.. తనకు చెందిన వస్తువులుగా చెబుతూ పలు విలువైన వస్తువులను తీసుకు వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేశారు.సామ్రాట్ పలు తెలుగు చిత్రాల్లో నటించారు. వీరి పెళ్లి కొంతకాలం క్రితం జరిగింది. ఈ వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వారు ఆ తర్వాత భార్యా, భర్తల మధ్య గొడవ వచ్చినట్లుగా తెలుస్తోంది.

Recommended