• 7 years ago
On the second day of his ongoing Anantapur Tour, Pawan Kalyan visited the house of AP Minister Paritala Sunitha. The other day, He informed about his plans to meet politicians in the district to fight collectively against the drought and backwardness.

తాను పరిటాల కుటుంబాన్ని కలవడం ఇదే మొదటిసారి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం అన్నారు. పరిటాల కుటుంబానికి, తనకు మధ్య గతంలో ఏదో జరిగిందని, విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి పవన్ నవ్వుతూ సమాధానం చెప్పారు. వీరి ఇంటికి తాను తొలిసారి వచ్చానన్నారు. పవన్ కళ్యాణ్ ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంట్లో అల్పాహారం తిన్న విషయం తెలిసిందే. వారిద్దరు దాదాపు గంటకు పైగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత టీ తాగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్.. పరిటాల కుటుంబంతో తనకు విభేదాలు అన్న ప్రచారంపై స్పందించారు.
తనకు ఎవరితో ఎలాంటి వివాదాలు, విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా అందరినీ గౌరవిస్తానని చెప్పారు. పరిటాల కుటుంబంతోను ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. అది కూడా నిరూపించేందుకు వచ్చానని తెలిపారు. జిల్లా సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. రాయలసీమకు హైకోర్టుతో పాటు ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీని త్వరలో కలిసి వివరిస్తానని చెప్పారు. రాయలసీమ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు.
పవన్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి పరిటాల సునీత ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. పవన్ జిల్లా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పవన్‌కు తన భర్త పరిటాల రవి గుండు కొట్టించారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. తన భర్త అలాంటి వ్యక్తి కాదన్నారు.

Category

🗞
News

Recommended