కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: సర్వే!
  • 6 years ago
49 per cent would chose the Congress in the Karnataka Assembly Elections 2018, a survey has stated. The survey conducted by Lokniti-CSDS states that the BJP comes second with 27 per cent and the JD(S) would bag 20 per cent of votes.

కర్ణాటకలో 2018లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 49 శాతం ఓట్లు వస్తాయని లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే తెలిపింది. రెండువ స్థానంలో ఉన్న బీజేపీకి 27 శాతం ఓట్లు, ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ మూడుస్థానికి పరిమితం అయ్యి 20 శాతం ఓట్లు సంపాధించుకుంటుందని సర్వేలో వెలుగు చూసింది.
మూడ్ ఆఫ్ ది నేషన్ 'పేరుతో కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో లోక్ నీతి జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ సందీప్ శాస్త్రీ ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం పనితీరుపై సర్వే చేశారు. డాక్టర్ సందీప్ శాస్త్రీ బెంగళూరులోని జైన్ డీమ్డ్ యూనివర్శిటి వైస్ చాన్స్ లర్ గా పని చేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మీద బెంగళూరు నగరంలోని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులో 55 శాతం మంది సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చెప్పారని సర్వే వివరించింది. 11 శాతం మంతి కాంగ్రెస్ పార్టీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని, మిగిలిన వారు పర్వాలేదు అని అన్నారని సర్వే చెప్పింది.
చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఎక్కవ శాతం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముఖ్యంగా మైనారిటీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని సర్వే తెలిపింది. ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకలోని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని సర్వే చెప్పింది.
లోక్ నీతి-సీఎస్ డీఎస్ సర్వే ప్రకారం కర్ణాటకలో 11 శాతం మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారని, 46 శాతం మంది ప్రభుత్వ తీరు పర్వాలేదని, 33 శాతం మంది ఈ ప్రభుత్వం ఏం అంత గొప్పగా లేదని, 6 శాతం మంది ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, 4 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారని సర్వే తెలిపింది.బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని అన్ని నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి అంతగా మద్దతు లేదని వెలుగు చూసింది.
Recommended