వర్మ పెద్ద ఫిట్టింగే పెట్టాడు.. మియా నా ? మోదీ నా ?

  • 6 years ago
Rgv again clearly said that his intention in making GST was to show MiaMalkova's holiest manner and do aesthetic justice to each and every part of her body and mmkeeravaani ‘s music made it spiritual.

జనవరి 26.. సాధారణంగా అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల పైనే అందరి చూపు. కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్&ట్రూత్'తో చాలామంది ఎటెన్షన్‌ను అటువైపు మళ్లించాడు. నేటి ఉదయం 9గం.కు ఈ సినిమా విడుదల కాబోతుండటంతో.. చాలామంది 'జీఎస్‌టీ' సైట్‌పై ఆన్‌లైన్‌లో రెడీగా ఉన్నారు. అయితే అనుకున్నట్లుగానే వర్మ పెద్ద ఫిట్టింగ్ పెట్టేశాడు. ఆన్‌లైన్‌లో ఈ సినిమాను వీక్షించాలంటే రూ.150 చెల్లించాల్సిందే..
అందరిలా చేస్తే తను వర్మ ఎందుకవుతాడు?.. అందుకే తీరా విడుదల సమయానికి 'షరతులు వర్తిస్తాయి' అన్న ఫిట్టింగ్ పెట్టేశాడు. ఆన్ లైన్ చార్జీ చెల్లిస్తేనే 'జీఎస్‌టీ' చూసే అవకాశం అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సినిమాను నిర్మించిన యూఎస్ ప్రొడక్షన్ హౌజ్ ఈ చార్జీలను నిర్ణయించిందని.. చూడాలనుకునేవాళ్లు ట్విట్టర్ లో తాను పెట్టిన సైట్ లోకి వెళ్లి చూడవచ్చని తెలిపాడు.
ఇంతవరకు తాను చేసిన ఏ సినిమా కోసం ఇంత ఆత్రుతగా ఎదురుచూడలేదని రాంగోపాల్ వర్మ అంటున్నారు. నేటి ఉదయం 9గం.కు సినిమా విడుదల కాబోతుండటంతో.. ఎగ్జయిట్‌మెంట్ తట్టుకోలేకపోతున్నానని ట్విట్టర్‌లో తెలిపారు.
'గాడ్,సెక్స్&ట్రూత్'కు మీడియా 'జీఎస్‌టీ' అనే షార్ట్ ఫామ్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా వర్మ తన ట్విట్టర్ ద్వారా ఒక పోల్ కూడా నిర్వహించారు. నరేంద్ర మోడీ 'జీఎస్‌టీ'(గూడ్స్ సర్వీస్ టాక్స్), ఎక్కువ పాపులరా?.. లేక మియా మాల్కోవా 'జీఎస్‌టీ' (గాడ్,సెక్స్&ట్రూత్) ఎక్కువ పాపులరా? అన్న ప్రశ్రకు మియాకే ఎక్కువ మార్కులు పడటం గమనార్హం. మోడీ 'జీఎస్‌టీ'కి 33శాతం మంది ఓట్ చేస్తే... 67శాతం మంది మియాకే ఓట్ చేశారు. మొత్తం 35,522మంది ఓటింగ్ లో పాల్గొన్నట్లు తెలిపారు.