ఆరోజు ఉదయాన్నే'మహేష్ ప్రమాణ స్వీకారం'.. హెడ్ ఫోన్స్‌తో సిద్దంగా ఉండండి

  • 6 years ago
Bharat Ane Nenu first oath is going to be released on the occasion of Republic Day, 26th of January. This is going to be like a title song, which will be unveiled at 7 am.

మహేష్ బాబు-కొరటాల శివ ప్రాజెక్ట్ పట్టాలెక్కిన తర్వాత.. సినిమాకు సంబంధించిన ఏ అప్‌డేట్‌పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. సినిమా పట్టాలెక్కి ఇన్ని రోజులవుతున్నా.. ఇంతవరకు ఫస్ట్ లుక్ కూడా బయటకు రాలేదని అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. ఇంకా లేట్ చేయడం మంచిది కాదనుకున్నారో!.. మరేమో గానీ!.. మొత్తానికి ఫస్ట్ లుక్ డేట్‌తో పాటు టైమ్ కూడా ఫిక్స్ చేసేసింది 'భరత్ అనే నేను' చిత్ర యూనిట్..
భరత్ అనే నేను' ఫస్ట్ లుక్‌కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. జనవరి 26వ తేదీ ఉదయం 7గం.కు ఈ చిత్ర 'ఫస్ట్ ఓత్'ని విడుదల చేయబోతున్నట్లుగా పోస్టర్ ద్వారా తెలిపారు.
ఫస్ట్ ఓత్' రిలీజ్ అనగానే చాలామందికి అదేంటో అర్థం కాలేదు. టీజర్ రిలీజ్ చేస్తారా?.. లేక ఏకంగా ట్రైలరే రిలీజ్ చేస్తారా? అన్న ప్రశ్న తలెత్తింది. కానీ ఈ రెండు కాకుండా.. 'భరత్ అనే నేను'లో మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేసే ఆడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.
జనవరి 26న అన్ని మేజర్ ఆడియో ఫ్లాట్‌ఫామ్స్‌లో 'ఫస్ట్ ఓత్' విడుదల కానుంది. ఈ ప్రమాణ స్వీకారం వినడం కోసం.. అంతా హెడ్ ఫోన్స్‌తో సిద్ధంగా ఉండండి అంటూ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది.

Recommended