'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్ : పచ్చిగా.. ఎంతలా అంటే?

  • 6 years ago
There is a speculation that GST shooting pictures are leaked to some websites, those are too much bold.

'గాడ్ సెక్స్&ట్రూత్' ఫోటోస్ లీక్: పచ్చిగాఆర్జీవి.. కొంతమంది విపరీతంగా అభిమానించే వ్యక్తి, ఎక్కువమంది విపరీతంగా ద్వేషించే వ్యక్తి. అభిమానమైనా.. ద్వేషమైనా.. ఈ రెండూ ఆయనకు డోంట్ కేర్. నా ఆలోచనలు.. నా సినిమాలు.. నా ప్రపంచం.. ఒకరకంగా నేనో పచ్చి స్వార్థపరున్ని అని ఎన్నోసార్లు చెప్పేశాడు. ఏదేమైనా ఆర్జీవి మెంటాలిటీ చాలామందికి పచ్చి బూతుగా కనిపిస్తే.. ఆయన్ను అభిమానించేవాళ్లకు మాత్రం అందులో ఏదో తాత్వికత కనిపిస్తుంది. ఇప్పుడు గాడ్ సెక్స్&ట్రూత్ విషయంలోనూ అదే జరుగుతోంది.
గాడ్,సెక్స్&ట్రూత్ పోస్టర్ రిలీజ్ అవగానే చాలామంది నోరెళ్లబెట్టారు. అంతకుముందు గన్స్&థైస్, 'ఎక్స్'తో వర్మ ఇచ్చిన షాక్ మరిచిపోకముందే.. ఈసారి మరింత బోల్డ్ నెస్ తో యూట్యూబ్‌ను షేక్ చేయబోతున్నాడు. అయితే రిలీజ్ అయిన పోస్టర్ చూసే ఇంత షాక్ తింటున్నవాళ్లు.. సినిమా చూస్తే ఇక అంతే అన్న ప్రచారం జరుగుతోంది. అంత బోల్డుగా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారట వర్మ.
జీఎస్‌టీ షూటింగ్‌కు సంబంధించి కొన్ని ఫోటోలు లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. బయటకొచ్చిన కొన్ని ఫోటోల్లో ఆర్జీవి తెరకెక్కిస్తున్న విధానం మైండ్ బ్లాక్ చేసేలా ఉందట. అయితే ఇక్కడ కూడా ఆర్జీవి గొప్పతనాన్ని పొగడుతున్నవారు లేకపోలేదు. అంతటి నగ్న సౌందర్యాన్ని ఎదురుగాపెట్టుకుని.. మరో ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలం షూటింగ్ పైనే ఫోకస్ చేయడం వర్మకే సాధ్యమంటున్నారు.

Recommended