‘సెక్సిజమ్‌’.. నిర్మాతలను చెప్పుతో కొడతానన్న హీరోయిన్ శృతి !

  • 6 years ago
Sruthi Hariharan was speaking at the India Today conclave as a part of a panel on $exism in Cinema’, said, “One of the leading producers in Tamil Cinema bought the rights to my Kannada film and offered me the same role in the Tamil remake.


పార్క్‌ హాయత్‌ హోటల్‌లో జరిగిన ఇండియా టుడే సౌత్‌ కన్‌క్లెవ్‌-2018లో భాగంగా 'సెక్సిజం ఇన్‌ సినిమా' అంశంలో జరిగిన చర్చలో శృతి హరిహరన్, ప్రణిత, బినా పౌల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు ఇండస్ట్రీలో తమకు ఎదురైన సంఘటనలు వెల్లడించారు.
నేను చేసిన ఓ కన్నడ సినిమా తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేశారు. కన్నడలో చేసిన పాత్రనే తమిళంలో ఇచ్చారు. అయితే తమిళ హక్కులు కొని నిర్మాతలు తనను లైంగికంగా వేధించారని శృతి హరిహరన్ తెలిపారు.
ఐదుగురు నిర్మాతల్లో ఒకరు నా వద్దకు వచ్చి ‘మేము ఐదుగురం నిర్మాతలం. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటాం.' అని చెప్పడంతో నా చెప్పుచూపించి వెళ్లి వచ్చానని శృతి హరిహరన్ తెలిపారు.
తన పట్ల అలా ప్రవర్తించిన నిర్మాతలకు చెప్పు చూపించడం తన కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిందని, ఈ సంఘటన తర్వాత తమిళ్‌లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని శృతి తెలిపారు.
నేను వారి కోరిక తీర్చలేదనే కోపంతో నాపై దుష్ప్రచారం చేశారు. నాకు అవకాశాలు రాకుండా చేశారు అని శృతి తెలిపారు. తొలినాళ్లలో ఓ కన్నడ సినిమా సమయంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు ఆమె చెప్పారు.