‘చిరంజీవి’ని జపాన్‌లో చూసి కేటీఆర్ షాక్..!

  • 6 years ago
It’s a special feeling to see one’s own countrymen being adored in other countries. And IT Minister KT Rama Rao, currently on a business tour of Japan had one such moment on Thursday.

జపాన్ దేశ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఓ ఫొటోను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. జపాన్‌లోని షిజ్వోకా ప్రాంతంలోని హమామట్సు అనే చిన్న పట్టణంలో ఉన్న సుజుకి మ్యూజియంను కేటీఆర్‌ శుక్రవారం సందర్శించారు.
అయితే ఆ మ్యూజియంలో మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను చూసి కేటీఆర్‌ ఆశ్చర్యపోయారట. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోలు పోస్ట్‌ చేశారు.
‘సుజుకి మ్యూజియంను సందర్శించాను. ఈ పర్యటన చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఎవరి ఫొటో చూశానో ఊహించగలరా? మన మెగాస్టార్‌ చిరంజీవి. మన మాతృభూమికి చెందిన వారి ఫొటోను హమామట్సులాంటి చిన్నపట్టణంలో చూడటం గర్వంగా అనిపించింది' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
కాగా, జపాన్ పర్యటన సందర్భంగా టోక్యోలోని హమామట్సూలో సకురాయ్ లిమిటెడ్ కంపెనీ సీఈవో షిగెరు ఐసోబేను మంత్రి కేటీఆర్ బృందం కలిసింది. అనంతరం హమామట్సూలోనే స్టాన్లీ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ సీఈవో యోషిత్సుగు మత్సుషితాతో సమావేశమైంది. పారిశ్రామిక అనుకూల రాష్ట్రం తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో మంత్రి బృందం చర్చించింది.

Recommended