వర్మ పై పోర్న్ స్టార్ ట్వీట్ !

  • 6 years ago
ఎప్పుడూ సంచలనాల కోసం వెంపర్లాడే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం జీఎస్టీ (గాడ్, సెక్స్, అండ్ ట్రూత్). ఈ చిత్రంలో పోర్న్‌స్టార్ మియా మల్కోవా నగ్నంగా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్‌లో దుమారం లేపాయి. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్‌ గురించి మియా మల్కోవా ట్విట్టర్‌లో స్పందించారు. రాంగోపాల్ వర్మ గురించి వెల్లడిస్తూ ఆమె ట్వీట్ చేసింది.
ఇండియన్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నాపై యూరప్‌లో ఓ వీడియో షూట్ చేశాడు. దాని పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. సన్నీలియోన్ తర్వాత భారతీయ సినిమా పరిశ్రమకు పరిచయమైన రెండో పోర్న్‌స్టార్‌ను నేను అని మల్కోవా ట్వీట్ చేసింది.
మియా మల్కోవా 1992లో అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించింది. ఆమె సోదరుడు జస్టిన్ హంట్ కూడా పోర్న్ స్టార్ కావడం గమనార్హం.
2014లో సహనటుడు డేనియల్ మౌంటేన్‌ను వివాహం చేసుకొన్నారు. పురుషులతో కాకుండా మహిళలతోనే బూతు చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశంతో ఆ మధ్య సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించింది.
పెళ్లి తర్వాత పోర్న్ సినిమాల నుంచి వైదొలగాలని నేను, నా భర్త నిర్ణయించుకొన్నాం అని 2014లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే అవకాశాలు భారీగా రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకొన్నాం అని మల్కోవా వెల్లడించింది.

Recommended