7.3% గ్రోత్ 2018 : భారత్‌ను పోగిడేస్తున్న ప్రపంచ బ్యాంక్
  • 6 years ago
ince November 8, 2016, after the controversial demonetisation was announced by Prime Minister Narendra Modi, the ruling Bharatiya Janata Party (BJP) government has come under severe scrutiny for failing to uplift the country's economy because of its "hasty decisions".

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారులో కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రపంచ బ్యాంక్. నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఆర్థిక స్థితిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మరో సంచలన నిర్ణయం తీసుకుంది మోడీ సర్కారు. అదే జీఎస్టీ అమలు. జీఎస్టీతో దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నప్పటికీ.. ఒక్కసారిగా భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపింది. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ నేపథ్యంలోనే భారత వృద్ధిరేటుపై ప్రపంచ బ్యాంక్ సానుకూలంగా స్పందించింది.
భారతదేశంలో అమలవుతున్న సంస్కరణలు దేశ వృద్ధికి ఎంతో తోడ్పడతాయని పేర్కొంది. అంతేగాక, ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తోందని భారత్‌ను కొనియాడింది. ‘భారత ప్రభుత్వం అద్భుతమైన సంస్కరణలను అమలు చేస్తోంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశాల్లో ముందు వరుసలో నిలిచింది' అని ప్రపంచ బ్యాంక్ మంగళవారం పేర్కొంది.
అంతేగాక, భారత వృద్ధిరేటు 2018లో 7.3శాతంగా ఉండనుందని వెల్లడించింది. ఆ తర్వాతి రెండు సంవత్సరా(1919, 1920ల్లో వృద్ధిరేటు 7.5గా ఉండనుందని పేర్కొంది. నోట్ల రద్దు, జీఎస్టీతో ఏర్పడిన ఆటుపోట్లను తట్టుకొని 2017లో 6.7శాతం వృద్ధిరేటును నమోదు చేసిందని తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ 2018ను వాషింగ్టన్‌లో మంగళవారం ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది.