'బేవకూఫ్..' అన్న బాలయ్య.. చప్పట్లు కొట్టిన యాంకర్..!

  • 6 years ago
Nandamuri Balakrishna is one of the senior Tollywood stars who rarely misses Sankranthi season and he has a high success rate with his Sankranthi films. He is coming up with 'Jai Simha' this year.

ఒక్కో హీరోలో ఒక్కో స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ కూడా ఆ ఎలిమెంట్స్ తప్పకుండా ఆశిస్తారు. అందుకే అభిమానుల కోసమైనా సరే.. బాలయ్య సినిమాల్లో గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్ ఒక్కటైనా ఉంటుంది. తెరపై బాలయ్య ఆ డైలాగ్స్ చెబుతుంటే.. ఆయన ముఖంలో రౌద్రం చూసి ఫ్యాన్స్ విజిల్స్‌తో హోరెత్తించేస్తారు. ఇప్పుడు 'జైసింహా'తోనూ అభిమానులు ఆ హోరుకు సిద్దమైపోయారు. అభిమానులు పండుగ చేసుకునేలా.. జైసింహాలో బుల్లెట్‌లా పేలే డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
జైసింహా ప్రమోషన్ లో భాగంగా తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల సినిమా విశేషాల గురించి అడగ్గా.. అదిరిపోయే డైలాగ్ ఒకటి చెప్పారు బాలయ్య.
'ఎవరిని ఉంచాలో.. ఎవరిని లేపాలో అక్కడ ఉంటాది లెక్క. మీవాడి నుదిటి మీద బతుకు గీత లేదు. విధి రాత లేదు.. ఆయష్షు రేఖ లేదు. అక్కడ యుద్ధం చేసినా.. ఇక్కడ నీ పొగరు మారకపోతే బేవకూఫ్..' అంటూ తనదైన శైలిలో బాలయ్య డైలాగ్ పేల్చారు.
బాలయ్య అలా గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెబుతుంటే యాంకర్ శ్యామల చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చేసింది. ఇలా గుక్క తిప్పుకోకుండా ఇంత భారీ డైలాగ్స్ చెప్పడం ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

Recommended