బీర్ తో జుట్టు సమస్యలన్నీ మాయం: ఎలా అంటే సింపుల్ !
  • 6 years ago
The beer provides excellent nutritional value to the hair and contains as many sought-after ingredients as most other hair care products have. Ingredients in beer are malt and hops - protein that strengthens the hair cuticles. Proteins help in repairing the damaged hair caused by blow drying, straightening, colouring, curling, etc

మీ జుట్టు సంరక్షణ కోసం వివిధ రకాల పండ్లు, కూరగాయాలు, హెర్బల్ రెమెడీస్, హెర్బల్ టీలు, ఆకులు, కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించి ఉంటారు, మరి మీరు ఎప్పుడైనా బీర్ జుట్టుకు ఉపయోగించారా? బీర్ చర్మ, జుట్టు సమస్యలను తీర్చడానికి ఒక టానిక్ వంటిది. జుట్టు రాలే సమస్య.. మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరిలోనూ చాలా కామన్ ప్రాబ్లమ్. ఈ వయసు, ఆ వయసు అని లేకుండా.. అందరినీ ఇబ్బందిపెట్టే సమస్య ఇది. ఎలాంటి కారణం లేకుండా.. సడెన్ గా సమస్య రావచ్చు. జుట్టు తీవ్రంగా రాలిపోతే.. వాళ్ల ఆత్మ స్తైర్థ్యం మీదా ప్రభావం చూపుతుంది.జుట్టు రాలే సమస్యను ఫేస్ చేసేవాళ్లు.. దానికి ఎలాంటి ఎఫెక్టివ్ రెమెడీ లేదని భావిస్తారు. కానీ ఈ సమస్యతో బాధపడేవాళ్లకు అద్భుతమైన రెమెడీ ఉంది. అదే బీర్ రెమెడీ. ఈ న్యాచురల్ పర్ఫెక్ట్ రెమెడీ.. కొంతకాలంలోనే జుట్టు రాలడాన్ని అరికట్టి.. కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఎందుకుంటే బీర్ లో మినిరల్స్, విటమిన్స్ , ఇతర న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ఇవి కండీషనర్ గా పనిచేసి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

డ్రై హెయిర్ కోసం : తేనె, అరటి, గుడ్డుపచ్చసొన, బీర్
తేనెలో తేమగుణాలు ఎక్కువగా ఉండటం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది, హెల్తీ గ్లోను అందిస్తుంది. అరటి పండ్లలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువ ఇది, జుట్టుకు మేలు చేస్తుంది, జుట్టుకు తగిన మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది. డల్ నెస్ తగ్గిస్తుంది గుడ్డులో ప్రోటీన్స్ విటమిన్స్, మినిరల్స్ ఎక్కువ, ఇది జుట్టుకు మేలు చేస్తుంది బీర్ లో మినిరల్స్ , విటమిన్స్ , పోషకాలు అధికంగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

Recommended