ఆర్జీవి పై గీతా మాధురి కౌంటర్ !

  • 6 years ago
Singer Geetha Madhuri Given Strong Counter To Director Ram Gopal Varma's latest tweet over new year celebrations.


వర్మ వ్యాఖ్యలకు ఎదురెళ్లడమంటే.. అందులో పడి కొట్టుకుపోవడమే. తన వాదనతో ఎదుటోళ్లను ముప్పు తిప్పలు పెట్టి కన్ఫ్యూజన్‌లో ముంచేయడంలో ఆయన ధిట్ట. అందుకే వర్మతో ఆర్గ్యుమెంట్ అంటే చాలామంది తటాపటాయిస్తారు. దానికి బదులు సైలెంట్‌గా ఉండటమే బెటర్ అనుకుంటారు. కానీ సింగర్ మాధురి మాత్రం ఆయనకు కౌంటర్ ఇచ్చేంత సాహసం చేశారు..
'కేవలం హ్యాపీ న్యూ ఇయర్‌ అని విష్‌ చేస్తే సంతోషంగా ఉంటారనుకునే మూర్ఖులకు 'అన్‌హ్యాపీ న్యూఇయర్‌' చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఎదుటివారు సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్లు.. వారి ఆస్తులు, విలువైన వస్తువులు వేరొకరికి ఇచ్చేయాలి. కానీ..
'కానీ ఎవరూ అలా చేయరు. విషెస్ చెప్పడంలో ఖర్చేమి లేదు కాబట్టి వాటితో సరిపెట్టుకుంటారు. ఏదేమైనా హ్యపీ న్యూఇయర్‌ చెప్పడం ఇష్టంలేని వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు' అని వర్మ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు.
'నా వరకైతే.. ప్రతీ రోజూ ప్రత్యేకమైనదే. అందరూ నవ్వుతూ బ్రతకాలని చెబుతుంటారు ఇందులో ఏ ఖర్చూ లేదు. ఆ మాదిరిగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కూడా ఎదుటివారిలో అనుకూలతను పెంచడమే. ఒకవేళ దానికోసం ఏదైనా ఖర్చు చేస్తే తిరిగి దానినుండి మరేదైనా ఆశిస్తారు. ఇది కాసింత ప్రతికూలత పెంచే అవకాశం ఉంది'

Recommended