రసవత్తరంగా సంక్రాంతి బాక్సాఫీసు.. విజేత ఎవరో ?

  • 6 years ago
Pawan Kalyan's Agnyathavaasi, Balakrishna's Jai Simha, Surya's Gang movies set to release this Sankranthi 2018.

తెలుగు సినిమా పరిశ్రమకు అత్యంత కీలకమైన పండగ సీజన్ సంక్రాంతి సీజన్. ఈ సీజన్లో సినిమా విడుదలైతే పక్కా హిట్టే అనే సెటిమెంట్ ఎప్పటి నుండో ఉంది. ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన చాలా సినిమాలు హిట్టు కొట్టడం కూడా ఓ కారణం. ఈ సారి తెలుగు సినిమా పరిశ్రమ నుండి రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' , రెండోది బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న 'జై సింహ'. ఈ రెండు సినిమాలతో పాటు సూర్య హీరోగా నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం 'గ్యాంగ్' కూడా బరిలో నిలిచేందుకు సిద్ధమైంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకె్క్కిన ‘అజ్ఞాతవాసి' జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. వీరి కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుందని అంటున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సంక్రాంతికి ‘జై సింహ' సినిమాతో బరిలో దూకుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు కెఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈచిత్రంలో నయనతార హీరోయిన్. బాలయ్య నుండి అభిమనులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉండనున్నాయి. జనవరి 12న ఈ చిత్రం విడుదలవుతోంది.




Recommended