ఐటీ దాడులు, ఆర్థికంగా దెబ్బ ?

  • 6 years ago
For the second consecutive day, on Thursday, officials from the income tax department continued their scrutiny at places related to expelled and jailed AIADMK general secretary V K Sasikala and her relatives.


ఆర్ కే నగర్ ఉప ఎన్నికల తరువాత చిన్నమ్మ వీకే శశికళ నటరాజన్ కుటుంబ సభ్యుల మీద మరోసారి ఆదాయపన్ను శాఖ (ఐటీశాఖ) అధికారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మొదలైన ఆదాయపన్ను శాఖ దాడులు గురువారం కొనసాగుతున్నాయి. మన్నార్ గుడి మాఫియాను ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయని సమాచారం.

శశికళ ఫ్యామిలీకి ఆర్థికంగా కేంద్ర బిందువు అయిన పాడపాయ్ ప్రాంతంలోని మిడాస్ మద్యం కంపెనీలో గురువారం ఆదాయపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. మిడాస్ కంపెనీకి చెందిన ఆర్థికలావాదేవీలను ఆదాయపన్ను శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.



Recommended