మళ్ళీ ఫ్యాన్స్ పై ఫైర్ అయిన బన్నీ !

  • 6 years ago
Stylish star Allu Arjun graced his brother Allu Sirish's upcoming film Okka Kshanam pre-release function as chief guest. Allu Ajun requests his fans don't shout when some one speaks.


మెగా ఫ్యామిలీకి చెందిన సినిమా ఫంక్షన్లు జరిగినపుడు అభిమానులు గోల చేయడం, వారి మూలంగా వేదిక మీద మాట్లాడేవారు ఇబ్బంది పడటం లాంటివి గతంలో చూశాం. ఓ సారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేస్తుంటే బన్నీ గట్టి వార్నింగే ఇచ్చాడు. అప్పట్లో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి బన్నీకి అలాంటి సందర్భమే ఎదురైంది. ఈ నేపథ్యంలో బన్నీ మరోసారి సహనం కోల్పోయారు.
అల్లు శిరీష్‌, సుర‌భి, సీర‌త్ క‌పూర్, అవ‌స‌రాల శ్రీనివాస్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `ఒక్క క్ష‌ణం`. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సోమవారం సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా బన్నీ అభిమానుల తీరుతో విసిగిపోయారు.
తాను మాట్లాడుతుంటే అభిమానులు గోల చేయడంతో బన్నీ సహనం కోల్పోయారు. "ఫ్యాన్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్... ఎవరైనా మాట్లాడేపుడు ఎదురు మాట్లాడటం సంస్కారం కాదు. ఫంక్షన్ పెట్టిందే సరదాగా అరవడానికి... కానీ మనిషి మాట్లాడేపుడు కాదు. అది బేసిక్ రెస్పెక్ట్." అంటూ బన్నీ ఫైర్ అయ్యారు.

Recommended