Tower Design Finalized : టవర్ డిజైన్ కే మెజారిటీ ఓటు.

  • 6 years ago
Proposed designs of the buildings and other architectures soon-to-be constructed in Andhra Pradesh's new capital, Amaravati, were put on display on Friday. Tower design for Assembly building approved

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనానికి డిజైన్ ను ఫైనల్ చేశారు. మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే ఆ మోడల్ ను ఖరారు చేశారు. ఎపి రాజధాని అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి టవర్ ఆకృతి ఫైనల్ అయిపోయింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ సూచించిన రెండు డిజైన్ల లో ఈ టవర్ మోడల్ కే మెజారిటీ ప్రజలు మొగ్గుచూపారట. ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ టవర్ డిజైన్ పై చర్చించిన అనంతరం దీని నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ భవనానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన వివిధ డిజైన్లలో మెజారిటి ప్రజలు ఈ టవర్ డిజైన్ కే ఓటేసినట్లు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన డీప్ డైవ్ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబు శాసనసభ తోపాటు , హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ల డిజైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో ప్రభుత్వం సూచించిన మార్పుచేర్పుల గురించి నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చంద్రబాబుకు వివరించారు.

Recommended