టాలీవుడ్ స్టార్లకు కొత్త కష్టాలు..! | Filmibeat Telugu

  • 6 years ago
Super stars like Rajinikanth, Mahesh Babu, Allu Arjun are getting ready with thier movies for Summer. But Film Industry calls a bandh for Digital Survice providers issue. In this case, producer D Suresh Babu reacted on the DSP issue.

డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల వివాదం టాలీవుడ్ మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తున్నది. ఒకవేళ ఈ వివాదం తీవ్ర రూపం దాల్చితే టాలీవుడ్‌ పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిసున్నది. డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల (డీఎస్పీ) అధిపత్యాన్ని నిరసిస్తూ చలన చిత్ర వాణిజ్య మండలి మార్చి 1 నుంచి బంద్‌ పిలుపునివ్వాలని చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకొన్నది. భవిష్యత్‌‌లో ఈ వివాదంపై పెద్ద గొడవే జరిగే అవకాశం ఉందని ప్రముఖ నిర్మాత డీ సురేష్‌బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్ల వివాదం నెలకొన్న నేపథ్యంలో సినిమా చిత్రీకరణలను, రిలీజ్‌లను కూడా నిలిపివేయాలని నిర్మాతల్ని కోరుతూ నిర్మాతల మండలికి లేఖ రాసింది. దాంతో చిత్రసీమలో కలకలం మొదలైంది. వివాదం పరిష్కారం కాకపోతే నిజంగానే పూర్తయిన సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రానున్న వేసవి సీజన్‌లో భారీ బడ్జెట్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. రజనీకాంత్ నటించిన రోబో, మహేశ్‌బాబు నటించిన భరత్ అను నేను, అల్లు అర్జున్ చిత్రం నా పేరు సూర్య నా ఊరు ఇండియా లాంటి చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. పోటాపోటీగా అగ్ర కథానాయకుల చిత్రాలు విడుదలవుతున్న నేపథ్యంలో బంద్ పిలుపు నిర్మాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో వివాదం వేసవి సినిమాల విడుదలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో అని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Recommended