మెగాస్టార్ కావొచ్చు...కానీ చెప్పుకోవడానికి ఏముంది?

  • 6 years ago
R Narayana Murthy Speech at Tera Venuka Dasari Book Launch. Tera Venuka Dasari book launch event held at Park Hyath hotel. Chiranjeevi, Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event.

దర్శకరత్న దాసరి నారాయణ రావు జీవిత చరిత్రను ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు 'తెర వెనక దాసరి' పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొచ్చారు. మంగళవారం పార్క్ హయత్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవి, రాఘవేంద్రరావు, టి సుబ్బిరామిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి తనదైన రీతిలో మాస్ మసాలా స్పీచ్ ఇచ్చారు.
చిరంజీవిగారు... ఉయ్యాలవాడ నరసింహా రెడ్డితో ఆయన జన్మ ధన్యం కావాలని నా మనస్తూర్తిగా కోరుకుంటున్నాను. రామారావుగారికి ఎన్నో సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, నాగేశ్వర రావుగారికి ఎన్నో ఉన్నాయి... కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు, శోభన్ బావుగారికి సంపూర్ణ రామాయణం. చిరంజీవి గారు ఇంత మెగాస్టార్... కానీ చెప్పుకోవడానికి సినిమా ఏది లేదు. ఆయన గ్రేట్ మెగాస్టార్ కావొచ్చు... కానీ ముసలోడైanrపోతే చెప్పుకోవడానికి గొప్ప సినిమా ఏమీ లేదు. కానీ ఇపుడు ఉంది... ‘సై రా నరసింహారెడ్డి'...... అని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.
ప్రపంచానికి అరవింద్ విలన్ లాగా కనిపిస్తారు.ఆయన ఏ నక్షత్రంలో పుట్టారో కానీ అది ఆయన బ్యాడ్ లక్. కానీ ఆయన గొప్ప స్నేహ పాత్రుడు, గొప్ప హెల్పింగ్ నేచర్. గొప్ప ఆర్గనైజర్. చిరంజీవి, అరవింద్ కృష్ణార్జునుల లాంటి వారు.... అని ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

Recommended