రాజమౌళి దిమ్మతిరిగే ప్లానింగ్.. బాహుబలి తరహాలో మల్టీస్టారర్..!

  • 7 years ago
Writer Vijayendra Prasad is providing the story for SS Rajamouli Next movie. The movie is being produced by DVV Danayya under DVV Entertainments banner. Rajamouli wanted to finish the muliti starrer movie in three stretches.

బాహుబలి సంచలన విజయం తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్‌తో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగటైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్లుగా నటిస్తున్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. అదేమిటంటే..
బాహుబలి సినిమాకు గాను రాజమౌళి ప్లానింగ్‌ను చూసి సినీ దిగ్గజాలే ముక్కు వేలేసుకొన్న పరిస్థితి. ఎలాంటి తడబాటు లేకుండా ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌ను సునాయాసంగా ముందుకు తీసుకెళ్లాడు. అంతటి చక్కటి ప్లానింగ్ అనుభవం ఉన్న రాజమౌళి ఇప్పుడు మల్టీస్టార్ ప్రాజెక్ట్‌ను అదే విధంగా ముందుకు తీసుకెళ్లున్నాడట.
ఎన్టీఆర్, రాంచరణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలకు అనుగుణంగా రాజమౌళి తన ప్లానింగ్‌ను మొదలుపెట్టారట. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పక్కాగా పూర్తి చేసుకొన్నారనేది ఇన్‌సైడ్ టాక్. ఈ చిత్రాన్ని మూడు దశలలో పూర్తి చేయాలనే ప్లానింగ్‌తో రాజమౌళి ముందుకెళ్తున్నారు.
తొలుత ఎన్టీఆర్‌తో సన్నివేశాలను, ఆ కథను షూట్ చేస్తారట. ఎన్టీఆర్‌కు సంబంధించిన సీన్లును ముందుగా తెరకెక్కించి ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్లాన్ చేస్తున్నారట. దీంతో చిత్ర షూటింగ్ సంబంధించిన తొలి దశ పూర్తవుతుంది.

Recommended