దళితులపై దాడి ఘటన పై బీజేపీ నేత : అది 'షార్ట్ ఫిల్మ్‌', దాడి కాదు !

  • 6 years ago
Bharath reddy responded on Monday on Dalith issue in Nizamabad district.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో బీజేపీ నేత భరత్ రెడ్డి‌ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత యువకులపై తాను దాడి చేసిన మాట అవాస్తవమని అన్నారు. ఇందుకు సంబంధించి సోషల్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియో దృశ్యాలన్నీ ఒక షార్ట్ ఫిల్మ్‌లో భాగంగా తీసినవేనని అన్నారు.
షార్ట్ ఫిల్మ్ అయితే, ఘోరమైన పదజాలంతో వారిని ఎందుకు తిడతారు?' అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘మా చుట్టు పక్కల గ్రామాల్లో ఇప్పటికీ ‘దొరల రాజ్యం' ఉంది. ఆ గ్రామాల వాతావరణం యావత్తు ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఎటువంటి సెన్సార్ లేకుండా చిత్రీకరించా' అని భరత్ రెడ్డి అన్నారు. ‘ఆ షార్ట్ ఫిల్మ్ పేరేంటి?' అనే ప్రశ్నకు..‘దొరల రాజ్యం' అని భరత్ రెడ్డి సమాధానమిచ్చారు.
కాగా, భయం కారణంగా అలా చెప్పామని దళిత యువకులు నిజామాబాద్ వెళ్లిన తర్వాత అన్నారు గదా? అనే ప్రశ్నకు భరత్ రెడ్డి స్పందిస్తూ.. ‘హైదరాబాద్‌లో మీడియా ముందు వారు మాట్లాడిన విషయం మీడియా ద్వారానే నాకు తెలిసింది. పోలీసు అధికారులకు ఓ వీడియో స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలుసు' అని భరత్ రెడ్డి అన్నారు.

Recommended