అఖిల్ ‘హలో’ మూవీకి షాక్.. టీజర్ తొలగించిన యూట్యూబ్
  • 6 years ago
The teaser of "Hello" was removed from Annapurna Studios YouTube channel. YouTube India has deactivated the teaser after it got millions of views and likes.

అఖిల్ అక్కినేని నటించిన 'హలో' మూవీ వచ్చే నెల 22న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న వేళ ఊహించని షాక్ తగిలింది. ఆ మధ్య విడుదలైన 'హలో' టీజర్‌ను యూట్యూబ్ తొలగించింది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున నిర్మిస్తుండటంతో అన్నపూర్ణ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్‌లో దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ టీజర్‌కు మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. అయితే ఉన్నట్టుండి టీజర్ యూట్యూబ్ నుండి మాయం కావడంతో అభిమానులు షాకవుతున్నారు.
ఈ టీజర్ తొలగించడానికి కారణం ఇందులో వాడిన మ్యూజిక్ అని తెలుస్తోంది. అది కాపీ రైట్ ఉన్న మ్యూజిక్ కావడం, దాని వినియోగ హక్కులు పొందకుండా టీజర్లో వాడేయటంతో పసిగట్టిన యూట్యూబ్ దాన్ని తొలగించింది.
ఫిన్‌లాండ్‌కి చెందిన ఎపిక్ నార్త్ కంపెనీ టీజర్స్ కోసం ప్రత్యేకంగా మ్యూజిక్ తయారు చేస్తుంది. ఎంతో క్వాలిటీగా ఉండే ఆ మ్యూజిక్‌ని చిత్ర సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ టీజర్‌కి వాడాడట. దీంతో కాపీరైట్ క్లైమ్ కావడంతో హలో టీజర్‌ని యూట్యూబ్ నుండి తీసేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ వారు చర్యలు చేపట్టారు. కాపీ రైట్ ఉన్న ఆ మ్యూజిక్ హక్కులు కొని.... తిరిగి టీజర్ అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Recommended