చిరు, రవితేజకు ప్లాపులు రాలేదా? సాయి ధరమ్ తేజ్ అంతే...!

  • 6 years ago
Jawaan Director BVS Ravi in his latest interview said Teju has got the quality and can change his abilities as per the character just like the other Mega heroes. He said Teju is very disciplined, composed and very lively on the sets.

మాటల రచయితగా, స్క్రీన్ రైటర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బివిఎస్ రవి దర్శకుడిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన 'జవాన్' మూవీ డిసెంబర్ 1న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో 'జవాన్' సినిమా గురించిన విశేషాలు వెల్లడించడంతో పాటు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. తిక్క, విన్నర్, నక్షత్రం సమయంలో సాయి ధరమ్ తేజ్ ను కలిశాను. సుప్రీమ్ సినిమా చేస్తున్నపుడు ‘జవాన్' కథ చెప్పాను. నక్షత్రం తర్వాత నాతో సినిమా చేస్తానని సాయి ధరమ్ తేజ్ చెప్పడంతో నా ఇంట్లో ఆయన దీపం పెట్టినంత ఆనందం వేసింది అని బివిఎస్ రవి తెలిపారు.
సాయి ధరమ్ తేజ్‌కు ఈ మధ్య వరుస ప్లాపులు ఎదురయ్యాయి కదా జవాన్ సినిమాపై ఆ ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నకు బివిఎస్ రవి స్పందిస్తూ... "చిరంజీవిగారికి హిట్స్ తరువాత 'రాజా విక్రమార్క', 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లతో ప్లాపులు ఎదురయ్యాయి. తర్వాత 'గ్యాంగ్ లీడర్', 'రౌడీ అల్లుడు', 'ఘరానా మొగుడు'తో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. రవితేజ, నాని లాంటి వారు కూడా ప్లాపుల తర్వాత హిట్స్ కొట్టారు అని బివిఎస్ రవి గుర్తు చేశారు.

Recommended