హీరోయిన్ అవుతున్న మహేష్ మేనకోడలు !

  • 6 years ago
Mahesh Babu's niece set to debut in films with his sister Manjula's debut directorial venture

సినిమాల్లోకి స్టార్ల వారసులు వరదల్లా వెల్లువెత్తుతున్న వేళ సూపర్ స్టార్ కృష్ణ తనయ మంజుల మాత్రం ఎందుకనో కెరీర్‌లో రాణించలేకపోయింది. నీలకంఠ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఆమె తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో మెరిసింది తప్ప పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
మొదటినుండీ నటించాలనే అనుకున్నాను. కాని కుదర్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అయ్యాను.
ఆలోచిస్తే దీనంతటికీ బాధ్యురాలిని నేనేనని ఇప్పుడు అర్థమౌతోంది. సమాజం కోసం కాదు నా కోసం నేను ఆలోచించటం మొదలుపెట్టా" అంటూ చెప్పిన మంజుల. మొదట్లో హీరోయిన్ అవటానికి చాలా ప్రయత్నాలు కూడా చేసిందట. కానీ వర్కవుట్ కాలేదు. ఆమె హీరోయిన్ కావడానికి వీల్లేదని ఫ్యాన్స్ గొడవపెట్టారు.
ఆ తరువాత కొన్నేళ్ళకు నటిగా కొన్ని సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంజుల. చేసింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంజులని గుర్తుపట్టే వారు చాలా మంది ఉన్నారు.
అయితే హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోయాను అనే బాధను కొంతలో కొంత అయినా తీర్చుకోవడానికి ఆమె తన కూతురుని రంగుల ప్రపంచంలోకి దింపనుందట. ఎలాగైనా తన కూతురు జాన్విని హీరోయిన్ గా చూడాలని ఇప్పటి నుండే వెండితెరను పరిచయం చేయిస్తోంది.
ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక లవ్ స్టోరీలో ఒక మంచి క్యారెక్టర్ ని చేయించనున్నారట మంజుల. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ లో సందీప్ పక్కనే కనిపించి ఇంప్రెస్ చేస్తోంది.అయితే దీనిపై మంజుల మాట్లాడుతూ తనను ఎప్పుడు నేను షూట్ లోకి రానివ్వలేదు.

Recommended