మరీ ఇంత‌లా దిగ‌జారిపోతారా ?

  • 7 years ago
“I would love to make a comeback and I have been getting several offers. But I feel the roles are not substantial and worthy of staging a comeback. Also, since I am busy in politics, I need to figure out my time too,” says Nagma

కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మ‌న్‌గా నచ్చని సినిమానల్లా బ్యాన్ అంటూనో, లేదంటే సీన్లకు సీన్లు లేపేస్తూనో ఎన్నో నీతులు వ‌ల్లించి బాలీవుడ్ విలన్‌గా పేరు తెచ్చుకున్న పహ్ల‌జ్ నిహ్లాని ఇప్పుడు రూటు మార్చి జూలీ-2 వంటి ఎరోటిక్ సినిమాను నిర్మించటం ఒక షాక్ అయితే పబ్లిసిటీ కోసం అతను చెప్పిన కథ మరో వింత. ల‌క్ష్మీరాయ్ చాలా బోల్డ్‌గా న‌టించిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే మంచి హైప్ సాధించింది. ఈ హైప్ స‌రిపోలేదునుకున్నాడో ఏమో, ప‌బ్లిసిటీ కోసం ప‌హ్లాజ్ ఇటీవ‌ల ఓ బాంబ్ పేల్చాడు.
ఈ చిత్రం ఓ మాజీ హీరోయిన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అని చెప్పాడు. ఆమె పేరు బయటపెడితే.. తమకు లీగల్ సమస్యలు తప్పవని.. సినిమా విడుదల కూడా ఆగిపోవచ్చని ఆయనన్నాడు.
అందుకే ఆ నటి పేరు చెప్పబోమన్నాడు. అయితే పహ్లాజ్ చెప్పిన పాయింట్లన్నీ కలిపి చూసినవాళ్ళంతా ఆ కథ ఒకప్పటి సౌథ్ గ్లామర్ హీరోయిఒన్ నగ్మా అనే అనుకున్నారు. అసలు అలా అనుకోవాలన్నదే పహ్లజ్ ఉద్దేశ్యమేమో అన్నది కూడా ఒక టాక్ .
"1990-2000 మధ్య కాలంలో సౌత్ ను ఓ ఊపు ఊపిన హీరోయిన్ కెరీర్ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సౌత్ లో పెళ్లయిన ఓ సూపర్ స్టార్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది. ఆ వివరాలతో పాటు సౌత్ నుంచి ఆమెను ఎలా బయటకు పంపించారు. తర్వాత ఆమె భోజ్ పురిలో ఎలా స్టార్ అయి మళ్లీ నిలదొక్కుకుంది లాంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయి." జూలీ-2 సమర్పకుడు పహ్లాజ్ నిహ్లానీ స్వయంగా చెబుతున్న మాటిది.

Recommended