Telangana DGP Mahender Reddy Speech @ Sinivaaram Program | Oneindia Telugu
  • 6 years ago
Watch Telangana DGP Mahender Reddy Speech at Sinivaaram Program about education importance and he shared some Memories in his childhood life.

రవీంద్ర భారతిలో నిర్వహించే సినివారం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి IPS మాట్లాడుతూ తన చిన్నతనంలో పాఠశాలలు లేకుంటే మల్లికార్జున రాజు గారు చింత చెట్టుకింద కూర్చోపెట్టి చదువు చెప్పారు అంటూ పై చదువులు చదువుకోటానికి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిన పరిస్థితి గురించి వివరిస్తూ.. చదువు మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
మల్లికార్జున రాజు గారు , మజీద్ సార్ అంటూ తన చిన్ననాటి గురువులను తలుచుకుంటూ, పాఠశాల లో తనను ప్రోత్సహించడం మూలాన తనకు చదువుకునే అవకాశం కలిగిందన్నారు,తద్వారానే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.
పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో ప్రయోగాత్మకంగా గురుకుల విద్యాలయాలను నెలకొల్పారని, అటువంటి పాఠశాలల మూలం గానే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని అన్నారు. సాదించాలనే తపన ఉండటం ప్రయత్నం చేయడం ద్వారా ఏదైనా సాధించవచ్చు అకుంఠిత దీక్షతో ఏదయినా సాధించాలని ఆశయం పెట్టుకుని దాన్ని నెరవేర్చుకోవాలి, కష్టపడితే ఏదయినా సాధించవచ్చు,విద్యార్థులు కష్టపడే గుణాన్ని పెంపొందించేందుకోవాలి. ఏ మనిషి అయినా సుఖాన్ని, సంపదలను కోరుకుంటారని అవి విద్య ద్వారా వస్తాయని డి.జీ.పి.మహేందర్ రెడ్డి తన చిన్నతనం గుర్తు చేసుకుంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
Recommended