Social Media Summit Awards : Deepika Padukone received Award
  • 6 years ago
India’s most influential social media stars, channels and the men and women behind them came together celebrating the phenomenon of social media at the country’s first Social Media Summit & Awards 2017 organised by the Andhra Pradesh government here on Sunday.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తనకు ఎంతో నచ్చిందని, ఇక్కడ చుట్టూ ఉన్న పచ్చదనం ఎంతో ఆకట్టుకుందని ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అన్నారు. విజయవాడలో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 'సోషల్‌ మీడియా సమ్మిట్‌ 2017 అవార్డు' ప్రదానోత్సవానికి ఆమె హాజరయ్యారు.

సామాజిక మాధ్యమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా దీపికకు అవార్డును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అందజేశారు. ఈ సందర్భంగా నటి దీపికా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం సోషల్‌ మీడియా చాలా బలమైన మాధ్యమంగా మారింది. నాకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి అభిమానులే కారణం. ఇక్కడా ఇంతమంది అభిమానులు ఉండటం ఆనందంగా ఉంది.. ‘థాంక్యూ అమరావతి'' అని దీపికా సంతోషం వ్యక్తం చేశారు.

Recommended