27సెం.మీ పొడవున్న పురుగు, అతని శరీరం నిండా పురుగులే...అది తినడం వల్లే ? | Oneindia Telugu

  • 6 years ago
A North Korean soldier who was shot while fleeing across the border has an extremely high level of parasites in his intestines, his doctors say. Lee Cook-jong, who leads the team treating the soldier, said: "I spent more than 20 years of experience as a surgeon, but I have not found parasites this big in the intestines of South Koreans."

ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి ఓ సైనికుడు చొరబాటుకు యత్నించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉత్తరకొరియా సైన్యమే అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరపగా.. అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.గాయాలపాలైన అతన్ని దక్షిణ కొరియా దళాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాయి. ఈ సందర్భంగా అతనికి శస్త్ర చికిత్స అందించిన వైద్యులు.. అతని శరీర పరిస్థితిని చూసి షాక్ తిన్నారు. ఆ సైనికుడి శరీరంలోని ప్రతి అవయవ భాగంలోనూ వేల సంఖ్యలో పురుగులు ఉ‍న్నట్లు గుర్తించారు.
తన 20 ఏళ్ల కెరీర్‌లో ఇంతటి దారుణమైన కేసును డీల్‌ చేయలేదని సైనికుడికి శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అతని ఉదర భాగంలోని అవయవాల నుంచి 27సెం.మీ పొడవున్న పురుగును వెలికితీసినట్టు చెప్పారు.
ఆ సైనికుడి చిన్న పేగులో అయిత కొన్ని వందల కొద్ది గుండ్రని పురుగులు ఉన్నాయన్నారు వైద్యులు. ప్రస్తుతం సైనికుడి ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. కాగా, ఉత్తరకొరియా వ్యవసాయంలో 'నైట్ సాయిల్'గా పిలిచే మానవ మలాన్నే ప్రధాన ఎరువుగా వాడుతారు. ఆ కూరగాయలను తినడం వల్లే అతని శరీరంలో పురుగులు తయారైనట్టు వైద్యులు చెబుతున్నారు. వీటిల్లో కొన్ని ప్రాణాంతకమైనవని, మరికొన్నింటివల్ల పెద్ద ప్రమాదమేమి ఉండదంటున్నారు.