Bill Gates Attended AP Agritech Summit | Oneindia Telugu

  • 6 years ago
microsoft founder Bill Gates attended Andhra Pradesh agritech summit in Vishakhapatnam on Friday.

వ్యవసాయ రంగంలో భాగస్వామ్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడనని, వ్యవసాయ రంగంలో కలిసి ముందుకు సాగుదామని చెప్పారని, తాను ఆయన ప్రతిపాదనను అంగీకరించానని బిల్ గేట్స్ చెప్పారు.
ఏపీలోని విశాఖపట్నంలో అగ్రి టెక్ సదస్సు ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు వ్యవసాయ ప్రదర్శనలు తిలకించారు. అనంతరం బిల్ గేట్స్ మాట్లాడారు.
వ్యవసాయాన్ని వ్యాపారంగా చేసినప్పుడే వృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. భారత దేశంలో సాంకేతికత, నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఏపీ ముందుకు వచ్చిందని చెప్పారు.
వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంపు, మార్కెట్ అనుసంధానంపై ఏపీతో కలిసి పని చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదక పెంపుకు మరిన్ని పరిశోధనలు అవసరమని చెప్పారు. ఇండోనేషియాలో శాస్త్రవేత్తల పరిశోధనలు రైతులకు చేరువయ్యాయని చెప్పారు.
మెగా సీడ్ పార్కుల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. విత్తన ఉత్పత్తికి ఏపీ కేంద్రంగా మారనుందన్నారు. రైతులకు భూసార పరీక్ష పత్రాలు చేరాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల సమాచారం చిన్న రైతులకు సరిగా అందడం లేదన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల మార్పును ప్రోత్సహించాలన్నారు.