India vs Sri Lanka 1st Test Day 1 : India at 17/3 at stumps
  • 6 years ago
Owing to rains, india could only have 11.5 overs of play. In helpful conditions, Lakmal began on the right note by snapping KL Rahul right off the first delivery of the game.

భారత్-శ్రీలంక మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైన తొలి టెస్ట్ కు చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి . వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. పొద్దున్న 930 కు పడాల్సిన టాస్ మధ్యాహ్నం పడింది. ఇక టాస్ గెలిచిన శ్రీలంక భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు.
శ్రీలంక పేస్ బౌలర్‌ సురంగ లక్మల్‌ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ రాహుల్‌ అవుటై నిరాశపరిచాడు. సురంగ లక్మల్ వేసిన బాల్ కాస్త స్వింగ్ అవడంతో వదిలేయడానికి వెళ్లినా అది రాహుల్ గ్లోవ్స్‌ను తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో తొలి బంతికే అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. గత కొన్ని రోజులుగా కోల్‌కతాలో వర్షం పడుతుండటంతో పిచ్ మీద పచ్చిక ఉండటం, ఆకాశం మేఘావృతమై ఉండటంతో లంక పేసర్లకు కలిసి వచ్చింది. దీంతో శ్రీలంక బౌలర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా ఖాతా తెరవడానికే 21 బంతులు తీసుకున్నాడంటే బౌలర్లకు ఎంతగా పిచ్ అనుకూలించిందో అర్ధం చేసుకోవచ్చు.
భారత జట్టు స్కోరు 8.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి భారత్ 17 పరుగులు ఉన్న సమయంలో మరోసారి వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. వెలుతురు సరిగా లేకపోవడం, చిరు జల్లులు కురవడంతో.. ఆటగాళ్లు మైదానం వీడాల్సి వచ్చింది. వర్షం కారణంగా అప్పటికే రెండుసార్లు నిలిపివేశారు. వర్షం కారణంగా గురువారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కొంతసేపటికి వెలుతురు లేమి సమస్య కూడా ఎదురవ్వడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపివేశారు. అనంతరం మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత పరుగుల మిషన్‌ విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. ధావన్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ చేరాడు.
Recommended