నందమూరి కాదు.. నందిమూరి బాలయ్య

  • 7 years ago
Andhra pradesh governement announce Nandi Awards for 2014, 2015, 2016 years. This awards selection became contraversial in Film Industry. Many film personalities are raising thier voices injustice happend other movies. This awards issue become serious debate in Social media too.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు ఆగడం లేదు. నంది అవార్డుల కోసం సినిమా ఎంపిక జరుగలేదు. కేవలం పంపకాలు మాత్రమే జరిగాయి అనే వాదనను సోషల్ మీడియాలో నెటిజన్లు బలంగా వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం మీడియాలో కూడా చర్చనీయాంశమవుతున్నది. ఈ వ్యవహారంపై తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ నంది అవార్డులు కావు.. నందమూరి అవార్డుల అనే స్థాయికి ఆరోపణలు చేరాయి. కొందరు విమర్శకులైతే నందమూరి బాలక‌‌‌ృష్ణ కాదు.. నందిమూరి బాలకృష్ణ అనే కామెంట్లు చేస్తున్నారు.
2014, 15, 16 సంవత్సరాలకుగాను ఆంధ్ర ప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డుల విషయంలో అటు టాలీవుడ్‌లోనూ, ఇటు సోషల్‌ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.టీడీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికి, ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న హీరోలు, డైరెక్టర్లకే నంది అవార్డులను పంచారు అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన 'లెజెండ్‌' చిత్రానికి నంది అవార్డుల్లో పెద్దపీట వేయడం ప్రధానంగా విమర్శలకు తావిచ్చింది.
నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు' అని గీతా ఆర్ట్స్‌ కో ప్రొడ్యూసర్‌ మేనేజర్‌, నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Recommended